యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

28-10-2026 | 10:00pm

రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి ..........

యాదగిరిగుట్ట, అక్టోబర్ 28 (విజయక్రాంతి): యువత విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాల కు(Narcotic substances) దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైన యువత దేశానికి గొప్ప సంపదని  రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) యాదాద్రి భువనగిరి జిల్లా  చైర్మన్ సద్ది వెంకటరెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన  సమావేషంలో చైర్మన్ సద్ది వెంకటరెడ్డి  మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని, వ్యసనాలకు ఎవరు బానిసలు కాకూడదని అని అన్నారు. ఆరోగ్యవంతమైన యువత దేశానికి గొప్ప సంపదని అందువల్ల యువత పెడదారి పడకుండా విద్య పైన దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారి అందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం కొరకు పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఉదయం  11.00 గంటలకు గవర్నర్  లైవ్ కార్యక్రమం అందరు వీక్షించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్య నిర్వాహక సభ్యులు జంపాల అంజయ్య , ఐలేని రాంరెడ్డి, ఇమ్మడి రామచంద్రారెడ్డి, మేకల వెంకటేశ్వర రెడ్డి, మామిండ్ల అమరేందర్ రెడ్డి  బహుపేట సర్పంచ్ కవిడె మహెందర్, మెతుకు భాస్కర్ రెడ్డి, గోపాల యాదగిరి, విజ్ఞాన్ స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు