పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నాగల్‌గిద్ద, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలం ఎర్రబొగూడ గ్రామపంచాయతీ(Erraboguda Gram Panchayat) పరిధిలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్వామిదాస్ సోదరుడు రేణుక–సురేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలకు సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నూతన గృహంలో ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేరి దామరగిద్ద సర్పంచ్ రాజు, మొర్గి సర్పంచ్ శివశర్ణప్ప, కౌన్సిలర్ బి. రాజు ముదిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జైరాజ్, కృష్ణ, అమృత్, నర్సింలు, మాజీ ఎంపీటీసీ అర్జున్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.