బాలల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

28-10-2026 | 10:10pm

సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది

మంథని, అక్టోబర్28(విజయ క్రాంతి): బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టి, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంథని సీనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది సూచించారు. మంథని మండలం ఏగ్లాస్‌పూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు సురక్షిత బాల్యం, చిన్నారులపై జరుగుతున్న సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై ఆమె అవగాహన కల్పించారు.

అక్టోబర్ 26 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలపై జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండటంతో పాటు బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొల్లపల్లి జ్యోతి, న్యాయవాదులు రఘోత్తం రెడ్డి, కాట్కం శ్రీనివాస్, శశిభూషణ్ కాచే, కన్నూరి శ్రీహరి, రెండ్ల సతీష్, చిటిరెడ్డి అశోక్ రెడ్డి, జెంజర్ల శేఖర్, కె. వ్యాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు