ఆస్పత్రి సమస్యల పరిష్కారానికి కృషి

28-10-2026 | 10:14pm

ఐఎన్ టీ యూసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్

బెల్లంపల్లి: బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో(Singareni Area Hospital) నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననీ ఐఎన్ టీ యూసీ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పేరం శ్రీనివాస్ అన్నారు. బుధవారం  బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి నీ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా INTUC పిట్ కార్యదర్శి ఉమాదేవితో కలసి మాట్లాడారు.

ప్రభుత్వం, సింగరేణి ఏరియా కార్మిక సోదరులకు త్వరలో స్వంత ఇంటి కలను నిజం చేయనున్నదనీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పెర్క్స్ పై ఐటీ మాఫీ చేయనున్నదని తెలిపారు. ఆసుపత్రిలో పుర్తి స్థాయిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఆయాలను  నియమకాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా కార్యదర్శులు మాధవ్, కృష్ణ,సోకాల శ్రీనివాస్, మాసడి నారాయణ, జీ ఎం  ఆఫీస్ పిట్ కార్యదర్శి భీమేష్, రాజశేఖర్, శ్రీకాంత్, ఖైరగూడ పిట్ కార్యదర్శి భాస్కరచారీ, వినయ్ కుమార్, స్వామి, శంకర్,కాంట్రాక్టు కార్మికులు యమున, కుమారి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు