Instagramలో కంటెంట్ బ్లాక్
Instagramలో పోస్టుల తొలగింపు కలకలం.. కేంద్రంపై CJP నేతల ఆరోపణలు
న్యూఢిల్లీ (విజయక్రాంతి): సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Instagramలో ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులు, అకౌంట్లపై ఆంక్షలు విధిస్తున్నారంటూ Cockroach Janata Party (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ప్రతిరోజూ వేలాది పోస్టులు, అకౌంట్లను తొలగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను అణచివేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని సోషల్ మీడియా పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
CJP నేత ఆశుతోష్ రంకా కూడా భారత్‌లో వేలాది Instagram అకౌంట్లపై Restriction విధించారని, లక్షలాది వీడియోలను తొలగించారని ఆరోపించారు. వ్యంగ్య రచయిత, గేయ రచయిత వరుణ్ గ్రోవర్ తన 2047 వికసిత్ భారత్ లక్ష్యంపై రాసిన Satirical Poemకు సంబంధించిన పోస్టును Instagram తొలగించిందని వెల్లడించారు. భారత్ IT Act కింద వచ్చిన Legal Requirementకు అనుగుణంగా ఆ కంటెంట్‌ను పరిమితం చేసినట్లు Instagram నుంచి సందేశం వచ్చినట్టు ఆయన షేర్ చేశారు. ఈ చర్యపై వరుణ్ గ్రోవర్ వ్యంగ్యంగా స్పందించారు.
ఇదే తరహాలో Deshbhakt అనే వ్యంగ్య వేదిక కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసే కంటెంట్‌ను తొలగిస్తున్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టులో Election Commission of India (ECI) దాఖలు చేసిన అఫిడవిట్‌పై వివరణ ఇచ్చిన తమ Reelను Instagram తొలగించిందని న్యాయ వార్తా సంస్థ LiveLaw తెలిపింది. Legal Request అందిన కారణంగా కంటెంట్‌ను పరిమితం చేసినట్లు ప్లాట్‌ఫామ్ సందేశం ఇచ్చిందని పేర్కొంది. ఈ పరిణామాలతో సోషల్ మీడియాలో Content Moderation, Online Censorship, Freedom of Expression అంశాలపై చర్చ మొదలైంది. అయితే, పోస్టుల తొలగింపునకు సంబంధించిన అన్ని ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. ఏ కంటెంట్‌పై ఎలాంటి చట్టపరమైన అభ్యర్థనలు వచ్చాయి, వాటి ఆధారంగా Instagram ఎలాంటి చర్యలు తీసుకుంది అనే పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉందని అధికారులు తెలిపారు.