విద్యార్థినులకు పోక్సో చట్టంపై అవగాహన

28-10-2026 | 10:12pm

ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) :  ఘట్‌కేసర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో (Ghatkesar Zilla Parishad Girls High School)బుధవారం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి. వీరన్న పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలపై లైంగిక వేధింపులు, మంచి స్పర్శ–చెడు స్పర్శ, వ్యక్తిగత భద్రత, పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, బాధితులు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్, సెక్టార్ ఎస్సై, కోర్టు కానిస్టేబుల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు