నరసయ్యగూడెంలో మహాలక్ష్మి దేవిగా అమ్మవారి దర్శనం
నేరేడుచర్ల, అక్టోబర్ 17(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని ఐదవ వార్డు నరసయ్యగూడెంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు(Devi Sharannavaratri Celebrations) భక్తిశ్రద్ధలతో(devotional) కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి(Konatham Venkat Reddy) అమ్మవారి పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్,మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అలక శ్రవణ్ రెడ్డి,ఆలంపల్లి బిక్షం,నన్నెపంగ మధు,నన్నెపంగ సందీప్,నన్నెపంగ నాగరాజు,శిరీష మరియు భవాని మాలధారణ స్వాములు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.