చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బైంసా (విజయక్రాంతి) : లోకేశ్వరం కుంటాల మండలం(Lokeswaram Kuntala Mandals) కేంద్రాల్లో రైతు వేదికలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(Mudhol MLA Pawar Ramarao Patel) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాo కింద 97 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహాల సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎలినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని, పంటల సాగు, నీటి వినియోగం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల పంటలకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల సీనియర్ నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.