లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
తాడ్వాయి,అక్టోబర్,17( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలో శనివారం లబ్ధిదారులకు(Beneficiaries) కల్యాణ లక్ష్మి చెక్కులు(Kalyana Lakshmi cheques) పంపిణీ చేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు తాడ్వాయి మండల కేంద్రంలోని లబ్ధిదారులైన బ్రాహ్మణపల్లి స్వరూప, దుడ్డే రాజమణిలకు గ్రామ సర్పంచ్ విజయరాములు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుట్టకాడి రంజిత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మెట్టు చంద్రం, నాయకులు బండారి ఎల్లం, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.