అమరగిరి రహదారికి అటవీ అనుమతులు ఇప్పించండి

17-10-2026 | 08:11pm

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గ్రామస్థుల వినతి. 

కొల్లాపూర్ రూరల్ : కొల్లాపూర్ నుంచి అమరగిరి గ్రామానికి నిర్మిస్తున్న బీటీ రహదారి పనులు అటవీ శాఖ(Forest Department) అనుమతులు లేక నిలిచిపోయాయని, వెంటనే అనుమతులు ఇప్పించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను(MLC Teenmar Mallanna) గ్రామస్థులు కోరారు. ఈ మేరకు ఆరో వార్డు సభ్యుడు ఆకునమోని భరత్ యాదవ్(Akunamoni Bharat Yadav) బీసీ రాజ్యాధికార పాదయాత్ర సందర్బంగా వారికి వినతిపత్రం అందించారు. 

2025 ఫిబ్రవరి 9న మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఇప్పటివరకు 1.5 కిలోమీటర్ల రోడ్డు పనులతో పాటు ఎనిమిది కల్వర్టుల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. రహదారి పనులు నిలిచిపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను శాసనమండలిలో ప్రస్తావించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు