కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు

17-10-2026 | 08:03pm

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) తెలిపారు. జైనథ్ మండలం బెల్లూరి లో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు(CC Road) నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీసీ రోడ్ల నిర్మాణం, మహిళా సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామీణ గోదాములు తదితర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, సూర్య కిరణ్, కరుణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ముకుంద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు