త్రాగునీటి అడ్డన్న తీర్చండి
పినపాక,(విజయక్రాంతి): మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని గుర్తించకపోవడం బాధాకరం జానంపేటలో మంచినీళ్ల కోసం పబ్లిక్ నల్లాలు వేస్తున్నటువంటి ఈ తరుణంలో జానంపేట శివారు ప్రాంతం కొత్తగుంపు బార్డర్ వరకు ఆనుకుని ఉన్న 60 నుంచి 70 కుటుంబాలు మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని వివరించి శనివారం రోజున కార్యదర్శి షేక్ ఖాజా హుస్సేన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా ధర్మరాజు ల శంకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కూలి నాలి చేసుకుని పొద్దుపోయి ఇంటికి వచ్చేవరకు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారని ఎక్కడికో వెళ్లి తీసుకురావలసి వస్తుందని అక్కడి ప్రజల పరిస్థితిని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేదరమెట్ల శ్రీనివాసరావు తో గటి కుమార్ పాల్గొన్నారు.