వాలీబాల్ పోటీలు ప్రారంభం

17-10-2026 | 08:02pm

ములకలపల్లి,అక్టోబర్ 17 (విజయక్రాంతి): దసరా పండుగ(Dasara Festival) సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉమ్మడి పూసుగూడెం పంచాయితీ వాలీబాల్ పోటీలు(Volleyball competitions) మండలంలోని సుబ్బనపల్లి గ్రామంలో శనివారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ వేడుకలో సీతారాంపురం(Sitarampuram), పూసుగూడెం, వీకే రామవరం గ్రామపంచాయతీల సర్పంచులు కుంజా రవి,భూక్య ధర్మ, ఊకే ఆదిలక్ష్మి పాల్గొని పోటీలను ప్రారంభించారు.

ఈనెల 19వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి.పోటీల్లో ప్రధమ స్థానం  సాధించిన జట్టుకు రూ.5116, ద్వితీయ బహుమతి సాధించిన జట్టుకు రూ.3116 నగదు బహుమతులతో పాటు వాలీబాల్ కిట్లను అందజేయనున్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండ్రు భాస్కర్,దుబ్బ బాబు, పద్దం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు