గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతాలు
నిజాంసాగర్‌లో 400కుపైగా చెస్ బోర్డుల పంపిణీ
నిజాంసాగర్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తే అద్భుతమైన ప్రతిభను వెలికితీయవచ్చని నిజాంసాగర్ మండలం విద్యాధికారి తిరుపతిరెడ్డి(Mandal Educational Officer Tirupati Reddy) అన్నారు. చెస్ నెట్‌వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకతీయ సాండ్‌బాక్స్ సహకారంతో నిజాంసాగర్ మండలంలోని ప్రభుత్వ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలకు 400కుపైగా చెస్ బోర్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. చెస్ విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, ప్రణాళిక, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న చెస్ నెట్‌వర్క్ అసోసియేషన్ సేవలను అభినందించారు. ప్రతి పాఠశాలలో చెస్ క్లబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.
డా. ఎస్. నారాయణ గుప్తా మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్రతిభ ఉందన్నారు. కార్యక్రమంలో చెస్ నెట్‌వర్క్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధీర్ కోడాటి, ఈసీ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి, వ్యాపారవేత్త శశిధర్ తదితరులు పాల్గొన్నారు.