గుండె జబ్బుల నివారణపై అవగాహన కల్పించాలి

29-09-2026 | 07:37pm

- ప్రిన్సిపాల్‌ ఎం. పవన్‌కుమార్‌

టేకులపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల టేకులపల్లిలో జాతీయ సేవా పథకం(NSS) ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం(World Heart Day) సందర్భంగా ‘గుండె జబ్బులకు కారణాలు–నివారణలో మన బాధ్యత’ అనే అంశంపై మంగళవారం సెమినార్‌ నిర్వహించారు.

కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. పవన్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నేటి సమాజంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు ఒత్తిడితో కూడిన జీవనశైలి, కల్తీ ఆహారం, జంక్‌ఫుడ్‌, చక్కెర అధిక వినియోగం, మద్యపానం, పొగాకు సేవనం గుండె జబ్బులకు దారితీస్తున్నాయని తెలిపారు.

ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు చేసుకుని ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా గుండె జబ్బులను సాధ్యమైనంతవరకు నివారించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం అధికారి బానోత్‌ బాబురావు, స్టూడెంట్‌ కౌన్సిలర్‌ ముంతాజ్‌ అలీ, అధ్యాపకులు బసవమ్మ, సత్యవతి, శంకర్‌రావు, వేణుగోపాల్‌, శ్రీనివాసరావు, వరలక్ష్మి, నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది బిక్షం, అశోక్‌యాదవ్‌, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు