రాష్ట్రస్థాయి యువ టూరిజం క్లబ్ పోటీలలో (వైటిసి) ఉత్తమ ప్రతిభ
నిర్మల్ సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి): ఇటీవలి హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైటీసీ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు. కళాశాల విభాగంలో ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల (GJC Girls, నిర్మల్) ద్వితీయ సంవత్సరానికి చెందిన 8 మంది విద్యార్థినులు, నృత్య పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే, పాఠశాల విభాగంలో ఖానాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు ప్రోత్సాహక బహుమతి సాధించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను విద్యార్థులకు, శిక్షకులకు జిల్లా కలెక్టర్ శాలువాలతో సన్మానించి, ప్రశంసా పత్రాలు అందించారు. అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, జిల్లాకు పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులకు త్వరలోనే నగదు బహుమతి అందజేస్తామని తెలిపి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డిఈఓ భోజన్న, డిఐఈఓ పరశురామ్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిపివో శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.