కొంచావలి దర్గా అభివృద్ధికి కృషి చేస్తాం..
29-09-2026 | 08:00pm
తాంసి/భీంపూర్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి):కొంచావలి దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party)జిల్లా అధ్యక్షులు డా.నరేష్ జాదవ్,మాజీ ఎంపీ సోయం బాపు రావ్ లు అన్నారు..మంగళవారం భీంపూర్ మండలం అర్లి(టీ) గ్రామ శివారులోని కొంచావలి దర్గాను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకొని,ప్రత్యేక ప్రార్థనలు చేశారు..జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు దర్గా వద్ద షెడ్డు నిర్మాణం,రోడ్డు, కరెంట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు..
ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డి,గండ్రత్ సుజాత,సంజీవ్ రెడ్డి, సర్పంచ్ కామన్ అశోక్,మండల నాయకులు సుదర్శన్,రవీందర్ జాదవ్,ముశ్రాన్ అహ్మద్,నరేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు...