అనుమతులు లేని నిర్మాణాల పరిశీలన
29-09-2026 | 07:57pm
డీపీవో అనూష
చుంచుపల్లి, సెప్టెంబర్ 29(విజయక్రాంతి ): ప్రధాన రహదారి (Main road)ఇరువైపులా అనుమతులు లేకుండా చేపడుతున్న ఇతర నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను కూడా డీపీఓ పరిశీలించారు. పంచాయతీ పరిధిలో (Panchayat area)భవన నిర్మాణాలకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగడంపై పంచాయతీ అధికారులను డీపీఓ వివరణ కోరారు. కోర్టు ఉత్తర్వులు, పంచాయతీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. డీపీఓ అనూష వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.