జర్నలిస్టుల సమస్యలపై సమరశంఖం
ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన
టీయూడబ్ల్యూజే కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి
ఉప్పల్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి(Mothe Venkat Reddy) డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మల్లాపూర్‌లో నిర్వహించిన ఉప్పల్ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డి. వెంకట్ రామ్ రెడ్డి, సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి.మల్కయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రాంప్రసాద్ శర్మ, కేసీ మోహన్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎండి అక్బర్ పాష, ఆదిమూలం శ్రీనివాస్, ఆర్ మల్లేష్ గౌడ్, రమేష్, జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్లు కొలనుపాక చంద్రమౌళి, విజయ్ లు, టీయూడబ్ల్యూజే ఉప్పల్ నియోజకవర్గ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డి సురేష్, ఉపాధ్యక్షులు రుద్రగోని నర్సింగ్ గౌడ్, కోశాధికారి వేముల శంకర్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల తిరుపతిరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయ చారి, ఉప్పల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్డేపల్లి కిషోర్, నియోజకవర్గంలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.