ఓటర్లందరికి సర్ నోటీసులు...

29-09-2026 | 08:08pm

చెన్నూర్,( విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని(Chennur Constituency) చెన్నూర్ కు కూతవేటు దూరంలో ఉన్న లంబడిపల్లి గ్రామ ఓటర్లను  సర్ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోందంటు గ్రామ సర్పంచ్ నాగవత్ మహేష్ నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో  (సర్ ) గ్రామ ఓటర్లందరికి  నోటీసులు జారీ అయ్యాయి.ఇదివరకే తామంతా ధృవీకరణ పత్రాలను బిఎల్ఓలకు అందజేసినప్పటి రెండు దఫాలుగా మళ్లీ నోటీసులు పంపడంపై  అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాతలు, తండ్రుల కాలం నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం,ఇక్కడనే ఓటు హక్కును ఇన్నాళ్లు వినియోగించుకున్నాం.తమ ఓటు ను తమకు కల్పించాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.2002 ఓటరు జాబితాలోని లంబడిపల్లి గ్రామంలో పేర్లు బల్క్ గా ఎగిరిపోయాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహశీల్దార్ మల్లిఖార్జున్ భరోసా ఇచ్చారు. జాబితాలో పేర్లు చేర్చేలా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు