తోటి డ్రైవర్ కుటుంబానికి అండగా లారీ డ్రైవర్స్ యూనియన్!
రాయినిగూడెం డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.30 వేల ఆర్థిక సాయం
గరిడేపల్లి, నవంబర్ 2 (విజయ క్రాంతి): మండలంలోని రాయినిగూడెం గ్రామానికి(Rayinigudem village) చెందిన లారీ డ్రైవర్ గుండు బుచ్చిబాబు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తోటి డ్రైవర్లు అండగా నిలిచారు. రాయినిగూడెం లారీ డ్రైవర్స్ అసోసియేషన్(Rayinigudem Lorry Drivers' Association) ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు.వృత్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో లారీ నుంచి సరుకులు అన్లోడ్ చేస్తున్న సమయంలో బుచ్చిబాబు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.తోటి డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాయినిగూడెం లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గుండు సైదులు, కొండ సైదులు, అజయ్, గోపీచంద్, నాగేంద్రబాబు, గోపీ, నర్సింహారావుతో పాటు పలువురు తోటి డ్రైవర్లు పాల్గొన్నారు.