NHRACCCI ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్

02-11-2026 | 06:48pm

బిక్కనూర్, నవంబర్ 2 (విజయ క్రాంతి): NHRACCCI ఫౌండేషన్(NHRACCCI Foundation) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్(Sriram Venkatesh as Telangana State President) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు సమాజ శ్రేయస్సుకు అంకితభావంతో పనిచేస్తానని శ్రీరామ్ వెంకటేష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు