ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ లక్ష్యం
ప్రజాదివాస్ కు 13 ఫిర్యాదులు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 02 (విజయ క్రాంతి) : ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ ప్రధాన లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో(District Police Office) నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్ఐలతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజలు నేరుగా పోలీసులను సంప్రదించాలని, చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.