పాడి పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణి
నేరేడుచర్ల,నవంబర్ 02(విజయ క్రాంతి): పాడి రైతుల సంక్షేమం(Welfare of Dairy Farmers),పశువుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పెంచికలదిన్నె గ్రామంలో ఆవు దూడలు,గేదె దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల(deworming medicine) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మండల పశువైద్యాధికారి డాక్టర్ జె.నరేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జె. నరేష్ మాట్లాడుతూ....దూడలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.నట్టల నివారణతో దూడల ఎదుగుదల మెరుగుపడటంతో పాటు వాటి ఆరోగ్యం కాపాడుకోవచ్చని,భవిష్యత్తులో పాడి పశువుల పాల ఉత్పత్తి పెరిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్య సేవలను పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఎల్లబోయిన లింగయ్య,గంట నాగరాజు,పశువైద్య ప్రథమ చికిత్సాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.