ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకుంటాం

02-11-2026 | 06:43pm

ఏంపీడీఓ అనిల్ 

లక్షెట్టిపేట , నవంబర్ 02(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని ఏంపీడీఓ అనిల్ కుమార్(MPDO Anil Kumar) అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని లక్షేట్టిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో('Praja Vani' (Public Voice) Program) నాలుగు దరఖాస్తులు వచ్చాయన్నారు.

వీటిలో బియ్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారని, ధరల పట్టికలు ఏర్పాటు చేయడం లేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి అవునూరి వెంకటేష్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాచర్ల రవి కిరణ్ ఫిర్యాదు చేశారు.

అదే విధంగా స్థానిక సీ ఎస్ ఐ రోడ్ లో కల్వర్ట్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫర్మార్ వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందని, కొమ్ముగూడెం చెరువు కట్టను పరిరక్షించాలని,జెండా వెంకటాపూర్ లో విద్యుత్ సరఫరా విషయంలో ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణిలో పలు శాఖల అధికారులు, ఇంచార్జ్ లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు