ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

02-11-2026 | 06:36pm

ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు...

ఉట్నూర్, నవంబర్ 02 ( విజయక్రాంతి): ఐటీడీఏ కార్యాలయంలో  నిర్వహించే  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(Integrated Tribal Development Agency) (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమరం భీం జిల్లా 

జైనూర్ మండలం జాడు గూడ గ్రామానికి చెందిన మోతిరం తనకి బావి మరియు టెంట్ హౌస్ మంజూరు కల్పించామని వాంకిడి మండలం దేహెగాం గ్రామానికి చెందిన సిడం చిత్రు తనకి ఏదైనా ట్రాక్టర్ ఇప్పించమని నార్నూర్ మండలం చేతగూడ గ్రామానికి చెందిన హరిచంద్ తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కల్పించామని తలమడుగు మండలం భీంపూర్ భూమారెడ్డి పట్టా మంజూరు కొరకు దరఖాస్తు అందజేసారు,

అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు