ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు మేవా ఆర్థిక సాయం
వైద్య ఖర్చులకు రూ.5 వేలు.. అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేలు అందజేత
బూర్గంపాడు,(విజయక్రాంతి): ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ముస్లిం ఎంపవర్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్(Muslim Empowerment Welfare Association) (మేవా) వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఇద్దరు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన షేక్ జబ్బర్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఆయనకు రూ.5 వేల సాయం అందించారు.
అదేవిధంగా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన మోబిన్ ఇల్లు విద్యుత్ షాక్ కారణంగా పూర్తిగా ధ్వంసం కావడంతో ఆయన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా మేవా ప్రతినిధులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన వారికి సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మేవా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి జహీర్ పాషా, కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఘని, సోహెల్ పాషా, అజీజ్, సలీం, తాజుద్దీన్, హఫీజ్, ఇమ్రాన్, రఫీక్, నాగర్ వల్లి బాబా తదితరులు పాల్గొన్నారు.