లయన్స్ క్లబ్ నేరేడుచర్ల సేవలకు దక్కిన అరుదైన గౌరవం

17-10-2026 | 07:09pm

నేరేడుచర్ల,అక్టోబర్ 17(విజయ క్రాంతి): నల్లగొండలో(Nalgonda) నిర్వహించిన 320ఈ 2025-26 జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో(District-level Awards Presentation Ceremony) లయన్స్ క్లబ్ నేరేడుచర్లకు(Lions Club Nereducherla) విశేష గుర్తింపు లభించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో(Social service program) అందించిన సేవలకు గుర్తింపుగా ఉత్తమ క్లబ్ అవార్డు విభాగంలో అధ్యక్షులు కీతా కనకయ్య, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ విభాగంలో లయన్ బట్టు మధు, ఉత్తమ సెక్రటరీ విభాగంలో లయన్ షేక్ యూసుఫ్, ఉత్తమ ట్రెజరీ విభాగంలో  లయన్ సరికొప్పుల నాగేశ్వరరావు గవర్నర్ లయన్ మదన్మోహన్ రేపాల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో , జీఎంటి కో-ఆర్డినేటర్ లాయర్ విశ్వనాథం  పాల్గొన్నారు. ఈ అవార్డులు క్లబ్ సభ్యుల సేవా స్ఫూర్తికి, సమాజాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి నిదర్శనంగా నిలిచాయి.

మరిన్ని వార్తలు