ధనలక్ష్మిగా రేణుక ఎల్లమ్మ
లింగంపేట్,(విజయక్రాంతి): లింగంపేట్ స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం(Renuka Yellamma Temple)లో దేవీ నవరాత్రుల ఉత్సవాల(Devi Navaratri Celebrations) సందర్భంగా అమ్మవారికి రూ. 6లక్షల 11 వేల తో అలంకరణ చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బుర్ర నారా గౌడ్ తెలిపారు.అలంకరణలో ధనలక్ష్మి(Dhanalakshmi)గా భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ కమిటీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు తాడూరి గోపి గౌడ్ ఆధ్వర్యంలో, గౌడ సంఘ సభ్యుల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కళాకారులు కలాలి వినోద్ గౌడ్, నాతి పోతన్ గౌడ్, తాడూరి రామా గౌడ్ బృందం అమ్మవారిని కరెన్సీ నోట్లు, హంసలు, గజరాజుల నమూనాలతో తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని ఆకాంక్షించారు.