చిట్టాపూర్‌లో ఐదు కోతులు సజీవ దహనం

17-10-2026 | 08:48pm

తాటి చెట్టుకు నిప్పు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

బజరంగ్ దళ్, వీహెచ్‌పీ

మల్లాపూర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం(Mallapur Mandal) చిట్టాపూర్ గ్రామంలో ఐదు కోతులు సజీవ దహనమవగా, మరికొన్ని గాయపడ్డాయి. కోతుల బెడద నివారణకు తాటి చెట్టుకు నిప్పు పెట్టే క్రమంలో ప్రమాదం జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు కొన్ని కోతులు చెరువులోకి దూకడం స్థానికులను కలచివేసింది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు చెట్టును నరికి కోతులను కిందకు దించారు. గాయపడిన కోతులకు చికిత్స అందిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

ఈ ఘటనపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల మృతికి కారణమైన వారిని గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై అటవీ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.

మరిన్ని వార్తలు