రామాలయ ధ్వజస్థంభ ప్రతిష్ఠకు రూ.50 వేల విరాళం

17-10-2026 | 08:53pm

 ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి  పబ్బ మహేష్ గుప్తా..

శివంపేట్ అక్టోబర్ 17 ( విజయక్రాంతి ) : శివంపేట గ్రామంలోని(Shivampet Village) పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ రామాలయం అభివృద్ధికి తాజా మాజీ జడ్పీటీసీ, ప్రముఖ సంఘసేవకులు పబ్బ మహేష్ గుప్తా(Pabba Mahesh Gupta) తన వంతు సహకారం అందించారు. ఆలయంలో ధ్వజస్థంభం ఏర్పాటు కోసం తన సొంత నిధుల నుంచి రూ.50 వేల విరాళాన్ని అందజేసి భక్తి, సేవాభావాన్ని చాటుకున్నారు. ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన మహేష్ గుప్తా, ధ్వజస్థంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

శివంపేట గ్రామంలోని పురాతన రామాలయంలో ధ్వజస్థంభం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చిన పబ్బ మహేష్ గుప్తా.. రూ.50 వేల నగదును ఆలయ పూజారి శాస్త్రుల రాజశేఖర్ శర్మకు అందజేశారు. ధార్మిక కార్యక్రమాలకు, గ్రామంలోని ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన చాటుకున్నారు.

అంతేకాకుండా ధ్వజస్థంభ ప్రతిష్ఠ జరిగే రోజున ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తానని మహేష్ గుప్తా ప్రకటించారు. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందనే విధంగా తన సేవా కార్యక్రమాల ద్వారా ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు, ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజా జీవితంలో ఉంటూ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్న పబ్బ మహేష్ గుప్తా సహకారంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్, ఉపసర్పంచ్ ఇసుగారి మల్లేష్, వార్డు సభ్యులు ముయడ్డి ముత్యాలు, కొవ్వురి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు బాసంపల్లి పోచ గౌడ్, మగ్దుంపూర్ సర్పంచ్ సోము అశోక్, పిఎంజి  యువసేన సభ్యులు కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, సోముసాని రేవంత్, పత్రాల త్రినేష్ గౌడ్, కల్లూరి రాజు, బాలాపురం సురేష్, సాదక్, క్యాసని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు