పెద్దపల్లిలో చింతలముని నల్లారెడ్డి స్వామి ముఖద్వారం ప్రారంభం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి.
మల్దకల్ అక్టోబర్ 17: గద్వాల నియోజకవర్గం(Gadwal Constituency) మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామంలోని పాల్వాయి చింతలముని నల్లారెడ్డి స్వామి ఆలయ(Nalla Reddy Swamy Temple) ముఖద్వారాన్ని గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి(Alvala Shirisha Rajashekar Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. కీ.శే. అనంత నారాయణ శెట్టి, కుంటి నారాయణ శెట్టి జ్ఞాపకార్థం, నిర్మాణ దాత హోటల్ బీసన్న సహకారంతో ఈ ముఖద్వారాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చింతలముని నల్లారెడ్డి స్వామి కృపతో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పండించిన పంటలు బాగా పండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పాల్వాయి రాముడు, ఉపసర్పంచ్ లక్ష్మీ నర్సింహులు, శివన్న, సురేంద్రయ్య, బీసన్న, సత్యన్న తదితరులు పాల్గొన్నారు.