భూ రీ-సర్వే పారదర్శకంగా జరగాలి
17-10-2026 | 09:00pm
అదనపు కలెక్టర్ చెన్నయ్య
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కోడేరు మండలం(Koduru Mandal) బావాయిపల్లిలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య(Additional Collector Chennaiah) శనివారం పరిశీలించారు. సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూముల వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటిస్తూ, నిబంధనల ప్రకారం రీ-సర్వేను(Land Resurvey) పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.