ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన న్యాయవాదులకు కేటాయించాలి
బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల వీరయ్య యాదవ్
హుజూర్ నగర్, నవంబర్ 09: అర్హులైన న్యాయవాదులకు ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) కేటాయించాలని హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జక్కుల వీరయ్య యాదవ్(Huzurnagar Bar Association Vice President Jakkula Veerayya Yadav) ప్రజాప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాసులకి వినతి పత్రం అందజేసి మాట్లాడారు... పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద ప్రజా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇండ్లను అర్హులైన న్యాయవాదులకు ఇండ్లు ఇళ్ల స్థలాలలో మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల సంక్షేమాన్ని ప్రజా ప్రభుత్వం గుర్తించి న్యాయవాదుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, తదితరులు, పాల్గొన్నారు.