కారేపల్లి ఎస్సైగా రమేష్ బాధ్యతల స్వీకరణ

09-11-2026 | 09:28pm

సింగరేణి నవంబర్ 9 విజయక్రాంతి : కారేపల్లి పోలీస్ స్టేషన్(Karepalli Police Station) నూతన ఎస్సైగా వీ.రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం టూ టౌన్ ఎస్సైగా పని చేస్తున్న వీ.రమేష్ కారేపల్లికి బదిలీపై వచ్చారు. ఆయన సింగరేణి సీఐ ఎన్.సాగర్ ను కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పని చేసిన బైరు గోపి బదిలీ కాగా అయన వెకెన్సీ రిజర్వ్ గా ఉంచారు.  కొత్తగా వచ్చిన ఎస్సై రమేష్ ను ప్రజా ప్రతినిధులు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు