జిల్లా స్థాయి రోల్‌ప్లే పోటీల్లో ఇమాంపేట పాఠశాలకు ప్రథమ బహుమతి

29-10-2026 | 10:57pm

సూర్యాపేట రూరల్:  జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే పోటీల్లో సూర్యాపేట మండల పరిధిలోని ఇమంపేట పాఠశాలకు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరావు(District Educational Officer Srinivas Rao) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో సృజనాత్మకత, సామాజిక స్పృహ పెంపొందించేందుకు రోల్‌ప్లే పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఆరోగ్యం, పరిశుభ్రత, మానసిక శ్రేయస్సు, మాదకద్రవ్యాల నివారణ, బాధ్యతాయుత పౌరసత్వం వంటి పలు సామాజిక అంశాలపై నాటకీయ ప్రదర్శనలిచ్చి ఆలోచింపజేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో ఇమాంపేట టీజీ మోడల్ స్కూల్ బృందం ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, ఎంఎస్ఆర్ సెంట్రల్ స్కూల్ ద్వితీయ, జలాలపురం జడ్పీహెచ్ఎస్ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అనంతరం విజేతలకు డీఈఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 

మరిన్ని వార్తలు