మల్లెపూల వాగులో చిక్కుకున్న మహిళను కాపాడిన రెస్క్యూ టీం

05-11-2026 | 12:06am

దమ్మపేట, నవంబర్ 04 (విజయక్రాంతి): మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో మల్లెపూల వాగులో చిక్కుకున్న మహిళను రెస్క్యూ టీం(Rescue Team) కాపాడింది. గండుగులపల్లి గ్రామానికి చెందిన వీరప్రోలు నాగమణి పొలం పనులు కోసం వెళ్లగా ఆకస్మికంగా వచ్చిన మల్లెపూల వాగు వరదలో చిక్కుకుంది.

గ్రామస్తులు మంత్రి తుమ్మలకు తెలియజేయగా, వెంటనే స్పందించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల చరవాణి ద్వారా మాట్లాడి రెస్క్యూటీం ను ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు. తుమ్మల ఆదేశాలతో దురదపాడుకు చేరుకున్న రెస్క్యూ టీం ఆమెను సురక్షితంగా కాపాడింది. నాగమణి క్షేమంగా ఇంటికి రావడంతో దురదపాడు గ్రామస్తులు, నాగమణి బంధువులు మంత్రి తుమ్మలకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు