కారు బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
05-11-2026 | 12:19am
బోథ్ నవంబర్ 4 (విజయక్రాంతి): నేరడిగొండ మండలంలోని చించోలి హనుమాన్ ఆలయం(Chincholi Hanuman Temple) వద్ద రాత్రి 10 గంటల ప్రాంతంలో కారు బైక్ ను ఢీకొనడంతో బోత్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్వాశంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. తన మిత్రులతో కలిసి దండారి ఉత్సవాలకు వెళుతున్న ఈ కారును ఢీ కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయలపాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష శాక్షలు తెలిపారు.