శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

11-09-2026 | 08:05pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): శ్రీ చైతన్య టెక్నో స్కూల్(Sri Chaitanya Techno School), నేరేడుచర్ల బ్రాంచ్‌ లో బోనాల వేడుకల(Bonala celebrations)ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ వేషధారణలో పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ దేవరశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు