పతకాల వేట షురూ
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతా తెరిచింది. షూటింగ్‌లో రెండు రజతాలతో పతకాల వేట మొదలైంది. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ పతకాలు వచ్చాయి. అలాగే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ పతకం ఖాయమైంది. అటు పురుషుల, మహిళల హాకీ జట్లు భారీ విజయాలతో శుభారంభం చేసాయి.
- షూటింగ్‌తో ఖాతా తెరిచిన భారత్
- వలవరిన్‌కు రెండు రజతాలు
- మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ పతకం ఖాయం
- హాకీ జట్ల శుభారంభం
నగోయా, సెప్టెంబర్ 20 : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడ(Asian Games)ల్లో తొలిరోజు భారత్‌కు షూటర్లు పతకాలు అందించారు. మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగంలో మెడల్స్ గెలిచారు. ఈ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని మహిళల టీమ్ అందించింది. 10 మీ. ఎయిర్ రైఫిల్ టీమ్(Air rifle team event) విభాగంలో వలరివన్(Valarivan), సోనం మాస్కర్, విదర్శ వినోద్(Sonam Maskar, Vidarsha Vinod)తో కూడిన బృందం ఫైనల్స్‌లో సత్తా తాటింది. మొత్తం 1898 పా యింట్లు సాధించి రెండో స్థానంలో నిలవ డం ద్వారా రజతాన్ని సొంతం చేసుకుంది. చైనా 1904.2 పాయింట్ల స్వర్ణం గెలవగా, ఆ తిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచి కాం స్యాన్ని అందుకుంది.
అయితే ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ ఎలవెనిల్ వలరివన్ అద్భుతం చేసింది. 633.5 పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధించిన ఆమె తుది పోరులోనూ అదరగొట్టింది. స్వర్ణ మే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆమె తృటిలో దానిని చేజార్చుకుంది. వలరివన్ 252.4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని గెలిచింది. జపాన్‌కు చెందిన హినట టైచి 253 పాయింట్లతో స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, సౌత్‌కొరియా ఫటర్ హ్యోజిన్ కాంస్యం సాధించింది.
హాకీ జట్లకు అదిరే ఆరంభం
ఆసియా క్రీడల హాకీలో భారత మహిళల పురుషుల జట్లు దుమ్మురేపాయి. తమ తొలి మ్యాచ్‌లలోనే భారీ విజయాలను అం దుకున్నాయి. మహిళల హాకీలో భారత్ 19-0 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను చిత్తు చేసింది. ఏ దశలోనూ ఉజ్బెకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోయింది. భారత ప్లేయర్లు గోల్స్‌తో చెలరేగిపోయారు. ఫార్వార్డ్ ప్లేయర్ దీపిక ఏకంగా 8 గోల్స్‌తో రికార్డు సృష్టించింది. వీటిలో ఆరు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే వచ్చాయి. అలాగే ఇషికా హ్యాట్రిక్ గోల్స్ చేయగా, సి యామి, నవనీత్‌కౌర్, బల్జీత్‌కౌర్, లాల్తాంటువాంగి, సాక్షిరాణా కూడా గోల్స్ చేశారు. మరోవైపు పురుషుల హాకీ జట్టు కూడా అదరగొట్టింది. తొలి మ్యా చ్‌లో ఇండోనేషియాపై 13-1 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో పతకం
మహిళల సాంప్రదాయ 60 కేజీల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(ఎంఎంఎ) విభాగం లో సుచికా తరివాల్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆసియా క్రీడల ఎంఎంఎ చరిత్రలో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. మంగోలియాకు చెందిన బైగాల్మా ను 2-0తో ఓడించి సుచికా ముందంజ వేసింది. అటు టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్ శుభారంభం చేసింది. ఆకుల శ్రీజ, సుతిర్ధ ముఖర్జీ, సిండ్రెల దాస్ జోడీ ఇండోనేషియాపై 3-0తో విజయం సాధించింది.