పరిమిత డీజే సౌండ్ కు అనుమతి

21-09-2026 | 10:07pm

ఆర్మూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): పరిమిత డీజే సౌండ్ కు అనుమతి ఇవ్వాలని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయి బాబా గౌడ్(Congress Party Town President Sai Baba Goudఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డికి విన్నవించారు. సోమవారం ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఆర్మూర్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగే వినాయక నిమ్మజన శోభ యాత్రకు రెండు టాప్ బాక్స్ లకు, ఒక బేస్ బాక్స్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించడంతో నాయకులు ఏసీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు నర్మె నవీన్, గుపాల భుపెందర్, తాటి హన్మాండ్లు, గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు గొనె రఘు, బబ్లూ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు