కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు
21-09-2026 | 10:04pm
గజ్వేల్, సెప్టెంబర్ 21: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) సేవలు చిరస్మరణీయమని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. దండ రాజిరెడ్డి అన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా సోమవారం విశ్వవిద్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఏ. భగవాన్, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.