భక్తి గీతాలకు మహిళల సందడి
21-09-2026 | 10:25pm
వినాయక మంటపం వద్ద భజన పాటలతో నృత్యాలు
గండీడ్: సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం(Reddipalli Village)లో కట్టకాడ వినాయక మంటపం వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో భజన పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయకుడి సన్నిధిలో భక్తి గీతాలకు అనుగుణంగా మహిళలు చేసిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంటపం పరిసరాలు భక్తి పారవశ్యంతో సందడిగా మారాయి. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.