మండల కమిటీలను ఎస్సీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి
21-09-2026 | 09:54pm
జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడేపల్లి మహేందర్
మనోహరాబాద్, సెప్టెంబర్ 21, (విజయ క్రాంతి): మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడేపు మహేందర్(SC Cell President Tadepu Mahender) ఒక ప్రకటనలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు మానుకొండూరు ఎం.ఎల్.ఎ డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మెదక్ జిల్లాలో ఎస్సీ సెల్ జిల్లా కమిటీ, టౌన్ కమిటీలు, అన్ని మండల కమిటీలను నూతనంగా వేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు ఈ కమిటీలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, బయోడేటా, ఒక పాస్ ఫోటో తో దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడేపు మహేందర్ వెల్లడించారు.