ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్

06-11-2026 | 07:50pm

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ తన Familyతో కలిసి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భార్య దేవిష, కుమార్తెతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి సర్యు ప్రధాని ముందు కన్నడ పాట పాడగా, మోదీ ఎంతో ఆసక్తిగా విన్నారు.

ఈ మధురమైన సమావేశంపై మోదీ X (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రామ్, సర్యుల రాకతో దీపావళి వేడుకలు మరింత పవిత్రంగా, దివ్యంగా మారాయని పేర్కొన్నారు. సూర్యకుమార్ కుటుంబంతో ప్రధాని సరదాగా గడిపిన ఈ క్షణాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.


మరిన్ని వార్తలు