భారత హాకీ జట్టుదే సిరీస్

23-11-2026 | 05:15am

కివీస్‌తో చివరి మ్యాచ్ డ్రా

ఆక్లాండ్, నవంబర్ 22: న్యూజిలాండ్ పర్యటనలో(New Zealand Tour) భారత పురుషుల హాకీ జట్టు(Indian men's hockey team) అదరగొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1 కైవసం చేసుకుంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 2 డ్రాగా ముగించింది.మ్యాచ్ 9వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను డిలాన్ థామస్ గోల్‌గా మలచడంతో న్యూజిలాండ్ 1 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు నిమిషాల్లోనే భారత్ కెప్టెన్ సంజయ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరును 1 సమం చేశాడు.

18వ నిమిషంలో కార్తీ సెల్వం అద్భుతమైన ఫీల్ గోల్‌తో ఆధిక్యాన్ని 2 పెంచాడు. అయితే చివరి క్వార్టర్ హోరాహోరీగా సాగింది. ఆధిక్యాన్ని కాపాడుకునేందుకు భారత్ ప్రయత్నించినా, 55వ నిమిషంలో న్యూజిలాండ్ ఆటగాడు బెంజీ కుల్హేన్ ఫీల్డ్ గోల్ చేయడంతో మ్యాచ్ 2 డ్రాగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో 3 తేడాతో గెలిచిన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుని సిరీస్‌ను 1 గెలుచుకుంది. భారత్ ,న్యూజిలాండ్ మధ్య వందేళ్ల క్రీడా సంబంధాలకు గుర్తుగా ఈ ప్రత్యేక సిరీస్‌ను నిర్వహించారు.


మరిన్ని వార్తలు