అజ్ఞాత వ్యక్తి ఎవరు?
- ఎన్విడియా చిప్ వ్యవహారంపై ప్రముఖ ప్రతిక కథనం
- వెలుగులోకి కీలక విషయాలు
- అమెరికా, సింగపూర్ దర్యాప్తు వివరాలు బటయకు
- తమకేమీ తెలియదన్న మెగాస్పీడ్
- సింగపూర్, మలేషియా నుంచి చైనాకు చిప్స్
- నిబంధనల ఉల్లంఘనలపై అమెరికా సీరియస్
వాషింగ్టన్, నవంబర్ 22: ఎన్విడియా వ్యవహారంలో(Nvidia affair) తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్(CEO Jensen Huang) రాజీనామా చేయడానికి ప్రధాన కారకురాలైన అలిస్‌ను ముందుంచి తెర వెనక ఓ చైనా వ్యాపారి ఈ కథ మొత్తం నడిపించారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజాగా అమెరికా, సింగపూర్ అధికారులు చేస్తున్న దర్యాప్తు తీరుతెన్నులను వివరించింది. అలిస్, ఆమె భర్త కాంగ్ వియ్ కలిసి చైనా కంపెనీలకు అక్రమ మార్గంలో ఎన్విడియా చిప్‌లను సరఫరా చేశారని పేర్కొంది.
దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జెన్సన్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉండి, చైనా గూఢచార సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అమెరికా అధికారులు అనుమానిస్తున్న అలిస్ హువాంగ్, చైనాకు నిషేధిత ఏఐ చిప్‌లను సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్ ఆధారిత మెగాస్పీడ్ కంపెనీకి కేవలం బహిరంగ ముఖం మాత్రమేనని తెలిపింది. అమెరికా ఎగుమతి ఆంక్షలను ఉల్లంఘించిన ఈ కుట్ర సూత్రధారి లీ మింగ్ ఏఐ చిప్‌లను చైనాకు మళ్లించడంలో కీలకపాత్ర పోషించాడు.
మెగాస్పీడ్ అనే సంస్థ ద్వారా చైనాకు ఈ చిప్‌లు సరఫరా చేయడంలో లీ మింగ్ కీలకంగా నిలిచాడు. గతేడాది ఇదే అంశంపై సింగపూర్‌లో లీ మింగ్‌పై మోసం కేసు కూడా నమోదైంది. సింగపూర్‌కు సరఫరా చేస్తున్నట్లుగా చూపించి అక్కడి నుంచి మలేషియాకు అక్కడి నుంచి చైనాకు చిప్‌లను తరలించారు. ప్రస్తుతం లీ మింగ్ బెయిల్‌పై విడుదలై చైనా రాయబార కార్యాలయానికి సమీపంలోని విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడు.
అలిస్ హువాంగ్, జెన్సన్ హువాంగ్, లీ మింగ్ ముగ్గురూ కలిసి ఆగ్నేసియా అంతటా అమెరికా నిబంధనలను ఉల్లంఘించి ఈ చిప్‌లను సరఫరా చేశారు. అలిస్‌తో ఎన్విడియా సీఈవో జెన్సన్ వివాహేతర సంబంధం నేపథ్యంలో రాజీనామా అనంతరం ఈ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాగా అలిస్‌కు జెన్సన్‌తో ఆమె భర్త కాంగ్ వీ పరిచయం చేసినట్లు వెల్లడైంది. కాగా సింగపూర్ సంస్థ మెగాస్పీడ్ మాత్రం తాము ఏమీ ఎరుగమని దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం కథ వెనుక చైనాకు చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు కూడా అమెరికా, సింగపూర్ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ దిశలో దర్యాప్తును ముమ్మరం చేశారు.