సెమీస్‌లో భారత మహిళల జట్టు

23-11-2026 | 05:15am
  1. థాయ్‌లాండ్‌పై ఘనవిజయం
  2. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ

భోపాల్, నవంబర్ 22 : మహిళల ఆసి యా చాంపియన్స్ ట్రోఫీ(Women's Asian Champions Trophy) హాకీ టోర్నీలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్ళింది. మూడో మ్యా చ్‌లో థాయ్‌లాండ్‌ను 7 గోల్స్ తేడాతో విజయం సాధించింది.భారత స్టార్ క్రీడాకారిణి దీపిక అద్భుత ప్రదర్శనతో 10వ, 11వ, 56వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించింది.

అలాగే నవనీత్ కౌర్ కూడా సత్తా చాటింది. మ్యాచ్ 4వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచి శుభారంభం అందించిన నవనీత్ చివర్లో (56వ నిమిషం) మరో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా రెండో గోల్ నమోదు చేసింది.ముంతాజ్ ఖాన్ 28వ నిమిషంలో, సునేలితా టోప్పో 32వ నిమిషంలో తలో గోల్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌లో మలేసియాపై, రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై విజయం గెలిచింది. టోర్నీలో అపజయం లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో చైనాతో తలపడుతుంది.

మరిన్ని వార్తలు