‘ఆలోచన’ సంతృప్తి నిచ్చింది

23-11-2026 | 05:10am

పీఎస్‌జే ఫిల్మ్స్ కంపెనీ బ్యానర్(PSJ Films Company banner) మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి వంటి వారు కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను వృద్ధాశ్రమంలో సరళారెడ్డి విడుదల చేశారు. ఈ నెల 27న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.. ‘ఆలోచన చిత్రంలో సంగీతం టీచర్‌గా శ్యామల అనే పాత్రను పోషించాను.

నా భర్తగా అంధుడి పాత్రలో మహర్షి రాఘవ వయోలిన్ మాస్టర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ మూవీ నాకు ఎంత సంతృప్తినిచ్చింది’ అని అన్నారు. నిర్మాత ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు చాచా ఎప్పుడూ ఏదో ఒక కథ గురించి చర్చిస్తూ ఉండేవాళ్లం. అలాంటి టైంలోనే ‘ఆలోచన’ కథను చెప్పాడు. ఆ టైంకి మాకు శ్రీనివాస్ కూడా అండగా నిలిచారు” అని చెప్పారు. నిర్మాత గుండబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆలోచన ఓల్డ్ ఏజ్ పీపుల్స్ చుట్టూ జరిగే ఈ కథ ఎంతో హార్ట్ టచింగ్‌గా ఉంటుందని తెలిపారు. దర్శకుడు సురేందర్ చాచా మాట్లాడుతూ.. 27న అందరూ చూసి ఆదరించాలని కోరుకున్నారు.


మరిన్ని వార్తలు