ప్రభుత్వ జీతం.. ప్రైవేట్ వైద్యం
- ఉదయం ఇక్కడ.. సాయంత్రం అక్కడ
- ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రులు
- సర్కార్ వైద్య సేవలకు నాలుగు గంటల డ్యూటీ
- స్వంత ఆసుపత్రుల్లో సేవలకు 10గంటల సమయం
- విధుల్లో నిర్లక్ష్యం.. ఇష్టానుసారంగా డ్యూటీలు
- నలుగురు వైద్యులను సస్పెండ్ చేసిన జిల్లా ఉన్నతాధికారులు
- ఖమ్మం జిల్లాలో హాట్ టాఫిక్
- ఏళ్ల తరబడి పనిచేస్తున్న పట్టించుకుని ఉన్నతాధికారులు
- నిరంతర తనిఖీలు లేకపోవడం.. పర్యవేక్షణ లోపమే కారణం
- ప్రభుత్వాసుపత్రికి గ్రహణం
నవంబర్ 22(విజయక్రాంతి): ఒకే రోజు నలుగురు డాక్టర్లను సస్పెండ్(Doctors suspended) చేయడం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది.. విధులకు నిర్లక్ష్యం వహిస్తున్న నలుగురు ప్రభుత్వ వైద్యులను ఉన్నఫలంగా సస్పెండ్ చేయడం ఖమ్మం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది.. విధులకు నిర్లక్ష్యం వహిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు చెబుతునప్పటికి మిగిలిన ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నస్తున్నారు.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులుగా పనిచేస్తూ ప్రభుత్వ జీతం తీసుకుంటున్న చాలా మంది వైద్యులు స్వంత ఆసుపత్రులు నడిపిస్తున్నారు..
కొంత మంది వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.. ప్రభుత్వాసుపత్రుల్లో సాధాహరణంగా విధులు నిర్వహిస్తూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం పాటు పనిచేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోరా..? అని ప్రజలు, రోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.. ప్రభుత్వానికి తెలిసి కూడా వదిలేస్తున్నారా..? ప్రభుత్వానికి తెలియకుండా వైద్యులు మ్యానేజీ చేస్తున్నారా..? అధికారుల పర్యవేక్షణ ఏమైంది.. తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నారా..? అనే సందేహాలు వినిపిస్తున్నాయి..
వైద్యుడంటే దేవుడే కాదా..?
వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు.. వైద్యుడంటే దేవుడితో సమానం అని.. ప్రజలకు సేవలందించడం.. ప్రజలను రక్షించడం..ప్రజలను బ్రతికించడం వైద్యుల వ్రుత్తి అని.. అందులో కొంతైనా సేవా భావం ఉండాలని నాటి పెద్దలు చెబుతుండే వారు.. వైద్యులు లేని సమాజం చికటి సామాజ్య్రం.. వైద్యం లేని గ్రామం యమపురి అవుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు.. అందుకే వైద్యులంటే ప్రజలకు అంతగౌరవం.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్నవారు, లేని వారు, పేదవారు, పెద్ద వారు రెండు చేతులు ఎత్తి దండం పెట్టే ఏకైక వ్యక్తి వైద్యుడు..
అంతటి ఘనకీర్తి కల్గిన వైద్యులు నేడు.. ఆధాయామే పరమావధిగా విధులు నిర్వహిస్తున్నారు. పేద ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు.. స్వంత ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్కువ సమయాన్ని వ్యచ్చిస్తున్నారు.. సరైన సమయంలో విధులకు రాకా.. ప్రభుత్వాసుపత్రులకు సక్రమంగా వెళ్లకుండా అక్కడ జూనియర్ డాక్టర్లు, సీనియర్ ఏఎన్‌ఎంలతో వైద్యసేవలను అందిస్తున్నారు.. ప్రజలకు సేవలందించాల్సిన వైద్యులు పైసల కోసం ప్రభుత్వాసుపత్రులను వదిలేసి ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు..
ఇక్కడ తక్కువ సమయం.. అక్కడ ఎక్కువ సమయం
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న వైద్యుల్లో కొందరు స్వంతంగా ప్రైవేట్ ఆసుపత్రులను నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ జీతం తీసుకుంటున్న కొందరు వైద్యులు నాలుగు గంటల వైద్యసేవలకే పరిమితమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.. మద్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 10గంటల వరకు అవసరమైతే అర్థరాత్రి కూడా వైద్యులు తమ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు...
ఖమ్మం నగరంలో ఎక్కువ మంది వైద్యులు, ప్రధాన పదవిలో ఉన్న వైద్యులు కూడా ప్రైవేట్ ఆసుపత్రులను నడిపిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తక్కువ వేతనం ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ఆ వేతనం కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తే అత్యధిక డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకే కొందరు వైద్యులు ప్రభుత్వాసుపత్రికి అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది..
విధుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.. కొందరు సీనియర్ వైద్యులు విధులకు హాజరు కావడం లేదనే ప్రచారం ఉంది.. జూనియర్ డాక్టర్లపై, హెడ్, ఏఎన్‌ఎం లపై ఆధారపడి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది..
సౌకర్యాలు ఉన్న ప్రభుత్వాసుపత్రులకు ఎందుకు చెడ్డపేరు..?
తెలంగాణ ఏర్పాటైన తరువాత ప్రభుత్వాలు వైద్య సేవలను మరింతగా ప్రజలకు అందించేందుకు అనేక రకాలైన సేవలను, సౌకర్యాలను అందిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పోరేట్ వైద్యసేవలు తరహాలోనే పరికరాలను ఏర్పాటు చేస్తోంది.. 100 పడకల నుంచి 1000 పడకల వరకు కొత్త ఆసుపత్రులను నిర్మాణం చేస్తున్నారు. నూతన పడకలను, నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి భవిష్యత్ నే మార్చేశారు. నూతనంగా ఎమర్జన్సీ భవనం ను కూడా ప్రారంభించారు.
ఎమర్జెన్సీ కేసులు వచ్చిన క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా పూర్తి అవసరమైన మౌళిక వసతులు, పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.. అయినప్పటికి ప్రజలు ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్తున్నారు.. అందుకు కారణం ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకపోవడం.. ఆసుపత్రుల్లో వైద్యులు రారు.. ఎక్కవగా పట్టించుకోరు.. నర్సులపై ఆధారపడతారు అంటూ రోగులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
పట్టించుకునే నాథుడే లేరా..?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుని ఏళ్ల తరబడి వైద్యసేవలను అందిస్తున్న వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.. చాలా మంది వైద్యులు తక్కువ సమయం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసి, మిగిలిన టైమ్ ను ప్రైవేట్ ఆసుపత్రికి కేటాయిస్తుంటే ప్రభుత్వాధికారులు, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులపై ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టోచ్చినట్లు కనిపిస్తుందని పలువురు విమ్మర్శిస్తున్నారు.
అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్ అకస్మిక తనిఖీలు మినహా ఇతర జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.. డిఎంఅండ్ హెచ్ ఓ, ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రులను రెగ్యూలర్ గా విజిట్ చేసి తనిఖీలు చేస్తూ, ప్రజలను వైద్యసేవల పనితీరును అడిగి తెలుసుకుంటే ప్రభుత్వ వైద్యుల పనితీరు మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ఎక్కడేక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి,
ఎంత సమయం ఆ ఆసుపత్రులకు సమయం కేటాయిస్తున్నారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత సమయం వ్యచ్చిస్తున్నారనే విషయాలపై ద్రుష్టి సారిస్తే వైద్యుల్లో మార్పులు రావోచ్చు అని ప్రజలు భావిస్తున్నారు. మరీ ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజల కోరిక మేరకు తనిఖీలు చేస్తారా..? ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకున్న వారి వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకుంటారా..? ఏం జరుగుతుందో... వేచి చూడాల్సిందే.. ?